కాకినాడ డీఎఫ్వో రవీంద్రనాథ్ రెడ్డి పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. మైనింగ్, అటవీ శాఖ అధికారులను బెదిరిస్తున్నారని అభియోగాలు రావడంతో, పవన్ విచారణకు ఆదేశించారు. రవీంద్రనాథ్, తన పేరు చెప్పి అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ఆయన తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.