పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మోడల్ గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గొల్లప్రోలులో ఆయన సోమవారం పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గొల్లప్రోలు జెడ్పీ హైస్కూల్లో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించారు.