తూర్పుగోదావరి జిల్లాలో పగడ్బంధీగా నూతన మద్యం పాలసీ ను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ షాపులకు లైసెన్స్ లు జారీ చేసే ప్రక్రియ ఈ నెల 31 వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.