గత మూడు రోజులుగా వేతన ఒప్పందం కోసం న్యాయమైన డిమాండ్స్ కోసం పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం, ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని తూ.గో జిల్లా సీపీఐ కార్యదర్శి తాటిపాక మధు సోమవారం తెలిపారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఐ, ఏఐటీయూసీ జిల్లా కమిటీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయన్నారు. భవిష్యత్తులో వారు చేసే పోరాటానికి సీపీఐ, ఏఐటీయూసీ వివిధ ప్రజా సంఘాలు అండగా ఉంటాయన్నారు.