కార్తికమాసంలో గోదావరి స్నానం ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులను కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. మంగళవారం రాజమండ్రిలోని కోటిలింగాలఘాట్, ఆర్యాపురం, పుష్కరఘాట్, కోటగుమ్మం సెంటర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. గోదావరి గట్టుపై కోటిలింగాలపేట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈట్ స్ట్రీట్ పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు.