తూర్పుగోదావరి జిల్లాలోని పేదల ఇళ్ల స్థలాల లేఔట్లలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద హౌసింగ్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక వసతులను ఏర్పాటు చేయడం ద్వారా పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు.