ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8 అడుగుల నీటిమట్టం

79చూసినవారు
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 5, 18, 401 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 8 అడుగులకు నీటిమట్టం చేరుకుందని అన్నారు. తూర్పు డెల్టాకు 3, 800, మధ్యడెల్టాకు 2, 000, పశ్చిమ డెల్టాకు 5, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసామన్నారు.

సంబంధిత పోస్ట్