ఘనంగా ముత్యాలమ్మ సారె ఊరేగింపు

79చూసినవారు
తొలి ఏకాదశి సందర్భంగా కడియం మండలంలోని వేమగిరి గ్రామ దేవత ముత్యాలమ్మ సారె ఊరేగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పండ్లు, పిండి వంటలు పళ్లాలలో పెట్టి గ్రామ పురవీధుల్లో ఊరేగారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్