రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలోని భవిత సెంటర్లో గురువారం గురుపూజోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూ. గో జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న వడ్డీ విశ్వపతిని స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోసి కుమార్, సత్య దంపతులు సాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విశ్వపతి సేవలు అభినందనీయమన్నారు.