ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు

60చూసినవారు
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటి మట్టం 13. 57 అడుగులకు చేరింది. 1, 800 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. మరో 6, 86, 602 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి వదిలారు. వరద ప్రవాహం రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా.

సంబంధిత పోస్ట్