కడియం: మహిళలు భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

76చూసినవారు
కడియం: మహిళలు భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కడియం మండలం కడియపులంకలోని సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ నందు నర్సరీ రైతులతో సౌత్ జోన్ డీఎస్పీ ఎస్. భవ్య కిషోర్ శనివారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీలో ఎక్కువ శాతం మహిళలు పని చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహిళల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్