కడియం మండలంలోని కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్ గురువారం సందడిగా మారింది. వినాయక చవితి నేపథ్యంలో అలరారుతోంది. ఒకవైపు గోదావరి వరద, ఎడతెరిపి లేని వర్షాలతో కడియపులంకలో పూల దిగుబడి గణనీయంగా తగ్గింది. పూలకు డిమాండ్ ఏర్పడడంతో ధరలు భారీగా పెరిగాయి. కాగా స్థానికంగా లభ్యమయ్యే పూలు కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అలంకరణ పూలను ప్రస్తుతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు.