రాజానగరం మండలంలోని కొండ గుంటూరు గ్రామంలో రైతు సేవ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.