కోరుకొండ: ప్రమాదవశాత్తు చెరువులో మునిగిన వ్యక్తి
కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో ఉన్న చెరువులో స్థానానికి దిగిన రాపెటి శ్రీను (42) మంగళవారం ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సంఘటన జరిగిన వివరాలు తెలుసుకున్నారు.