రాజానగరం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

71చూసినవారు
రాజానగరం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
రాజానగరం నియోజకవర్గంలో విద్య, ఉపాధి అంశాలకు సంబంధించి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో లోకేష్ ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన 16 అర్జీలు, రాజనగరం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన వినతుల గురించి లోకేష్ తో భేటీ అయిన ఎమ్మెల్యే వాటన్నింటిపై చర్చించారు.

సంబంధిత పోస్ట్