కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో శుక్రవారం ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చలంశెట్టి నాగదేవి(21)కి తన మేనమామ శివనారాయణతో 2019లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఇంట్లో వారంతా దగ్గరలోని కార్తీక వనసమారాధనకు వెళ్లి వచ్చారు. అనంతరం భర్త బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.