చింతూరు మండలం దిగువ సీలేరు డొంకరాయి, మోతుగూడెం ఏపీ జెన్ కో విద్యుత్ సంస్థ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేశారు. పీఆర్సీ కమిటీలో కొన్ని కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ తో కుమ్మక్కు అయి ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విధమైన నిరంకుశ పోకడలను ఎండగట్టాలని, ఆ చీకటి ఒప్పందం రద్దు పరచాలని, స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.