
రంపచోడవరం: "ఆదివాసీ సంఘాల బంద్ కు వైసీపీ సంపూర్ణ మద్దతు"
భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆదివాసీల హక్కులు సవరించాలని శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించడం అన్యాయమని, దానికి నిరసనగా 11, 12 తేదీలలో జరిగే అల్లూరి సీతారామరాజు జిల్లా బంద్ కు వైసీపీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి సోమవారం ప్రకటించారు. ఆదివాసీలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నేడు శాసన సభ స్పీకర్ 1/70 చట్టం సవరించాలని సూచించడం అన్యాయమన్నారు.