తమకు కల్పించిన హక్కులను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కల్పన అన్నారు. మంగళవారం రంపచోడవరంలోని సిఐడి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ తెగల అత్యవసర నిరోధక చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు జరిగే నేరాలకు సంబంధించి చట్టరీత్యా వారికి ఎలాంటి రక్షణ లభిస్తుందో అందరూ తెలుసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఐడి అస్మపర్వాని, పివో సింహాచలం, ఎస్ఐ శ్రీనివాస్, రమేష్ బాబు, గిరిజనులు పాల్గొన్నారు.