సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కార్తీక మాసం తొలి రోజు కావడంతో శనివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ఆలయ సన్నిధిలో నరసింహ సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు దర్శించుకుని భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.