విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, విద్యార్థులకు భోజనాలు పెట్టకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజోలు బీసీ వార్డెన్ అరిగెల పాండు రంగారావును విధుల నుంచి తొలగించారు. ఈ విషయం మంగళవారం రాజోలులో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసాద్ రావు సోమవారం తెలిపారు. అతని స్థానంలో ముక్తేశ్వరం వసతి గృహ అధికారి సీహెచ్ సాయిరామ్ ను ఇన్ ఛార్జ్ గా నియమించినట్లు ఆయన తెలిపారు.