పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ తెలిపారు. బుధవారం వెలగపూడి అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలు రెండు నియోజకవర్గాల్లోని సమస్యలపై కూటమి శ్రేణులతో సమీక్షించారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో కూటమి నేతలు శ్రీనివాస్, యుగంధర్, నాని, స్వామి, మోహన్ ఉన్నారు.