కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామపంచాయతీ పరిధి ఎస్ అన్నవరం, కొత్త సురవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి కూటమి నాయకుల సమక్షంలో సోమవారం ప్రారంభించారు. స్థానిక టిడిపి నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, మండల ప్రెసిడెంట్ అప్పన రమేష్, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది సమక్షంలో నిర్వహించారు.