చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

60చూసినవారు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ చెన్నకేశవరావు అన్నారు. తుని రూరల్ సీఐ కార్యాలయంలో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సిఐగా విధులు నిర్వహించిన మూర్తి బదిలీపై వెళ్లారు. నూతన సీఐ మాట్లాడుతూ. జూదం గంజాయి సారా పై ఉక్కు పాదం మోపుతామన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని మిగిలిన వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్