Oct 28, 2024, 10:10 IST/
పోలీసుల నోటీసులు.. రాజ్ పాకాల స్పందన ఇదే
Oct 28, 2024, 10:10 IST
జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనకు సంబంధించి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మోకిలా పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఎట్టకేలకు కేటీఆర్ బావమరిది స్పందించారు. మోకిలా పోలీస్ స్టేషన్‌కు రాజ్ పాకాల న్యాయవాదులు చేరుకున్నారు. విచారణకు వచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలని పాకాల న్యాయవాదులు పోలీసులను కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.