గొల్లప్రోలు: గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టరు స్వాధీనం
గొల్లప్రోలు మండలం చెందుర్తిలో అనుమతి లేకుండా ట్రాక్టరులో గ్రావెల్ తరలిస్తుండటాన్ని వీఆర్వో పద్మశేఖర్ గుర్తించి బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. ట్రాక్టరును స్వాధీనం చేసుకుని గొల్లప్రోలు పోలీసు స్టేషన్ కు తరలించారు. గనుల శాఖ అధికారులకు నివేదించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. పుష్కర కాలువ గట్టును తవ్వి గ్రావెల్ ను తరలిస్తున్నట్లు భావిస్తున్నారు.