ముగిసిన విరామ బైబిల్ పాఠశాల

58చూసినవారు
ముగిసిన విరామ బైబిల్ పాఠశాల
గొల్లప్రోలు పట్టణంలో బస్టాండ్ వద్ద గల బేతేలు ఆరాధన మందిరంలో గత మూడు రోజులుగా కొనసాగిన విరామ బైబిల్ పాఠశాల బుధవారంతో ముగిసింది. ఇందులో చిన్నారులకు అభినయ గీతాలతో పాటు చిత్రలేఖనం, కథలతో క్రీస్తు ప్రేమను వివరించారు. కొవ్వూరు నుంచి జాన్ ఏమిస్టర్ బృందంచే ప్రత్యేక పాటలతో పాటు పప్పెట్ షో ఎంతగానో అలరించింది. కేజీ నుంచి పీజీ వరకు వేరువేరుగా తరగతులు నిర్వహించగా పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్