గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కాట్రేనికోన మండలం బలుసుతిప్పకు చెందిన మేడ జయరాజు(25) శుక్రవారం సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి గల్లంతయ్యాడు. స్థానిక మత్స్యకారులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అతని మృతదేహం సముద్రతీరంలో ఆదివారం కనిపించింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు న్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై అవినాష్ తెలిపారు.