సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

80చూసినవారు
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి వుండటంతో పాటు అప్రమత్తంగా వుండాలని ఎస్సై రాముడు అన్నారు. గురువారం నారాయణపేట మండలం కోటకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పై స్పందించారదని, ఓటిపి, ఎటిఎం, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్