రోడ్డు బాలేక భర్తను మోస్తున్న భార్య
మామిడికుదురు మండలం అప్పనపల్లిలోని కేతావారిపేటకు చెందిన దివ్యాంగుడు శ్రీనివాస్ ఇంటికి రహదారి మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వీల్ చైర్లో మాత్రమే బయటకు వెళ్లే అతను ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలో వీల్ చైర్ వదిలి రావాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి మార్గం సరిగా లేకపోవడంతో అతని భార్య శ్రీనివాస్ ను మోస్తూ శుక్రవారం ఇంటికి తీసుకెళ్తున్న తీరు కలచి వేస్తోంది. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నాడు.