ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఓ యువకుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. హరీష్ బైస్లా అనే యువకుడు శనివారం తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఇక ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలోని గోకల్‌పూర్ డ్రెయిన్ గోడపై ఒంటరిగా కూర్చున్నాడు. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి డ్రెయిన్‌లో పడిపోయాడు. నీట మునిగి చనిపోయాడు. దీంతో వారి కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.