Nov 23, 2024, 17:11 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: బీఆర్ఎస్ విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది: ఎమ్మెల్యే
Nov 23, 2024, 17:11 IST
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డైట్, బిఈడి కళాశాలను ఆయన పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన డైట్ కళాశాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం అత్యున్నతమైన కళాశాలగా పేరు తెచ్చుకుందని, ఈ నెల 30 న నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.