Oct 03, 2024, 17:10 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
సంతోషిమాత దేవాలయంలో ఘనంగా దసరా నవరాత్రులు
Oct 03, 2024, 17:10 IST
జడ్చర్ల పట్టణంలోని విద్యానగర్ కాలనీలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా, గురువారం అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి పూజలు మరియు అభిషేకం నిర్వహించిన తర్వాత, భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.