రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో మెయిన్ రోడ్డులో మంగళవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తులు, పండుగ షాపింగ్ చేయడానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్వస్థలాలకు వెళ్తున్న వాహనదారులతో మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.