రామచంద్రపురం: మహిళ అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

82చూసినవారు
రామచంద్రపురం మండలం తోటపేట చెందిన దామిశెట్టి మహాలక్ష్మి (54) అనే మహిళ ఈ నెల 12వ తేదీన చనిపోయారు. సహజ మరణంగా భావించిన బంధువులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని గుర్తించిన బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా ద్రాక్షారామ పోలీసులు కేసు శుక్రవారం నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్