మామిడికుదురు: ముమ్మరంగా సార్వా పంట మాసూళ్లు
మామిడికుదురు మండలంలో సార్వా పంట మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండల పరిధిలో 2,420 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సార్వా పంట సాగు చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో పంట మాసూళ్లు పూర్తి చేశారు. 600 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు పంట నూర్పిడి చేస్తున్నారు. ఎకరానికి సగటున 25 నుంచి 28 బస్తాల దిగుబడి వస్తుందని ఏవో మృదుల శనివారం తెలిపారు.