ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్అండ్ ఆడిటర్ జనరల్ గా అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి తనయుడు కొండ్రు సంజయ్ మూర్తి బాధ్య తలు చేపట్టడంపై శుక్రవారం రాజోలు బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పొన్నాడ సూర్యారావు మాట్లాడుతూ ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి కావడం కోనసీమకే గర్వ కారణం అని అన్నారు.