Feb 17, 2025, 14:02 IST/
ఆ భూముల్లో ఇకపై నిర్మాణాలు చేపట్టవద్దు: తెలంగాణ హైకోర్టు
Feb 17, 2025, 14:02 IST
తెలంగాణ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కమ్మ, వెలమ, విశ్వబలిజ కాపు సంఘాలకు కేటాయించిన భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఉన్నట్లయితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని గతంలోనే ఉత్తర్వులున్నాయని.. వీటితోపాటు ఇకపై ఎలాంటి నిర్మాణాలు, చేపట్టరాదని వెలమ, కమ్మ, విశ్వబలిజ కాపు సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది.