సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకూడదు: సీఎం రేవంత్

79చూసినవారు
సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకూడదు: సీఎం రేవంత్
TG: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని పంటలకు నీరందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను చెప్పారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్