ప్రత్తిపాడు: కోడి పందేలు ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్టు
ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామ శివారున కోడి పందేలు ఆడుతున్న నలుగురిని అరెస్టు చేశామని ఎస్ఐ ఎన్. రామలింగేశ్వరరావు బుధవారం మీడియాకు తెలిపారు. వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ. 640 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ రామలింగేశ్వరరావు తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. జూద క్రీడల జోలికి పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.