తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 ప్రకారం.. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడ్ అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తున్నారు. దీనివల్ల రిజర్వ్‌డ్ కేటగిరీలో ఉన్నవారికీ తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.