APలోని మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భావితరాలకు అందుతుందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారు.