AP: కాకినాడ సెజ్, సీ పోర్టు లిమిటెడ్ షేర్ల బదాలయింపు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు నేడు హాజరయ్యారు. దీంతో అధికారులు మూడు గంటలుగా ఆయనను విచారిస్తున్నారు. షేర్లు, నగదు బదిలీపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. మధ్యాహ్నం లంచ్ విరామం తీసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డిని అధికారులు మళ్లీ విచారించనున్నారు.