త్వరలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని రీయింబర్స్‌మెంట్ చేయనున్నట్లు వెల్లడించారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా నేత కార్మికులకు శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. మంగళగిరిలోని చేనేత కార్యాలయంలో బుధవారం వివిధ జిల్లాల డీడీలు, ఏడీలతో ఆమె సమీక్ష నిర్వహించారు.