
మోపిదేవి: అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్ స్వాధీనం
మోపిదేవి మండలంలోని పెదకల్లేపల్లి పంచాయితీ శివారు మేళ్లమర్రు వద్ద అనుమతులు లేకుండా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లు రెవెన్యూ అధికారులు గురువారం పట్టుకున్నారు. గడచిన కొద్ది రోజులుగాఏ విధమైన అనుమతులు లేకుండా యదేచ్ఛగా అక్రమమట్టి రవాణాపై గ్రామస్తులు అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై తహసీల్దార్ శ్రీవిద్య ఆదేశాల మేరకు వీఆర్వో ప్రశాంత్ ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు.