రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన యువ క్రికెట‌ర్

61చూసినవారు
రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన యువ క్రికెట‌ర్
టీమిండియా ఆట‌గాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్‌ శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇరానీ కప్ కోసం తండ్రితో కలిసి కారులో కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్ర‌మాదంలో అతని మెడపై తీవ్ర‌ గాయమైన‌ట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఇరానీ కప్‌తో పాటు రంజీ ట్రోఫీలోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల దులీప్ ట్రోఫీలోనూ ముషీర్ అద్భుత ఆటతీరును కనబరిచాడు.

సంబంధిత పోస్ట్