కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. శనివారంతో ఆయన కస్టడీ ముగియడంతో జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు.. వచ్చే నేల 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. అనంతరం పోలీసులు జానీని చంచల్ గూడ జైలుకు తరలించారు.