ఈనెల 21నుంచి 23 వరకు జంగారెడ్డిగూడెంలో సీఐటీయు ఏలూరు జిల్లా సదస్సు, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సీఐటియు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బుధవారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం సీఐటీయు నాయకులు మాట్లాడుతూ. ఈ సదస్సుకు ఉభయ గోదావరి జిల్లాలలో నాయకులు హాజరవుతారన్నారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయు అనేక పోరాటాలు చేసిందన్నారు.