ప్రగడవరంలో పట్టపగలు చోరీ

56చూసినవారు
ప్రగడవరంలో పట్టపగలు చోరీ
చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. కలదండి వెంకటాచారి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బీరువాలో దాచుకున్న రూ. 60 వేల నగదు, 2 కాసులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్