జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వందనపు వెంకటేశ్వరావు, సాయిబాల పద్మ దంపతుల కుమార్తె ప్రియాంకను కొయ్యలగూడెంకి చెందిన శివ భాస్కర్‌కి ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన తర్వాత సంక్రాంతి పండుగకి మొదటి సారి కూతురు, అల్లుడిని ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళవారం 350 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.